కోయిలకొండలో కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ

కోయిలకొండ, వెలుగు: సంక్షేమ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికరెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో 180 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌‌ చెక్కులను పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..  రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తుందని పేర్కొన్నారు.