మడలేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి

చేర్యాల, వెలుగు: చేర్యాల పట్టణంలో అయిదు  రోజులుగా కొనసాగుతున్న రజకుల పండుగ సందర్భంగా వారి  ఆరాధ్యదైవమైన మడేలేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మడేలేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.

కార్యక్రమంలో రజక సంఘం నాయకులు, బీఆర్​ఎస్​ యూత్​ అధ్యక్షులు ఎస్​. అంజయ్య, ఆర్​. శ్రీను, టి. కనకయ్య, బి. యాదగిరి, సత్యం, బీఆర్​ఎస్​ నాయకులు యం. బాలనర్సయ్య, ఎ. శ్రీధర్​రెడ్డి, పి. ఎల్లారెడ్డి, ఎ. మల్లేశం, యం. నాగేశ్వర్​ రావు, పి. మానస, సిద్దిలింగం, చందు, పరుశరాములు, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. చేర్యాల, మద్దూరు, దూల్మిట్ట మండలాల్లోని దానంపల్లి, సలాక్​పూర్​, లింగాపూర్​ గ్రామాల్లో లైబ్రరీ బిల్డింగ్​, నూతన గ్రామ పంచాయితీ కార్యాలయం, సీసీ రోడ్లకు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు.