డబుల్​ బెడ్​రూమ్​ కాలనీలో సీసీ రోడ్లు నిర్మిస్తాం : మైనంపల్లి రోహిత్​రావు

మెదక్​టౌన్, వెలుగు : మెదక్​ పట్టణంలోని పిల్లికొట్టాల్​లో ఉన్న డబుల్​బెడ్​రూమ్​ కాలనీలో సమస్యలన్నీ పరిష్కరించడంతో పాటు త్వరలోనే కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతామని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్​రావు హామీ ఇచ్చారు. గురువారం పట్టణంలోని డబుల్​ బెడ్​రూమ్​ కాలనీలో ఆటోమెటిక్ క్లోరినేషన్ ఆన్​లైన్​ మానిటరింగ్, మున్సిపల్​ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సురక్షితమైన తాగునీటి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్న అకామ్ సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్​ చంద్రపాల్, కౌన్సిలర్లు శేఖర్, లింగం, లక్ష్మీనారాయణ, కాంగ్రెస్​ నాయకులు మధుసూదన్ రావు, పవన్, రాజేశ్, జీవన్ రావు, గంగాధర్, పరశురాం, బాని, సంతోష్, అశోక్, సాయి, నరేశ్, సమీ, కృష్ణ, అమీర్, సుదర్శన్, దుర్గప్రసాద్, పోచేందర్, సంగమేశ్వర్, అశోక్, అన్​మోల్​ సంస్థ ప్రతినిధులతో పాటు మున్సిపల్ కమిషనర్ జానకీ రామ్​సాగర్​ పాల్గొన్నారు.