వనపర్తి స్కూల్​ డెవలప్​మెంట్​పై.. సీఎంకు ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రపోజల్

వనపర్తి, వెలుగు: వనపర్తిలోని బాయ్స్ ​​హైస్కూల్​ను డెవలప్​ చేసేందుకు రూ.160 కోట్లతో తయారు చేసిన ప్రపోజల్​ను వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి మంగళవారం సీఎం రేవంత్​రెడ్డికి అందజేశారు. జడ్పీ బాయ్స్​​హైస్కూల్​ను రెనోవేషన్​ చేసేందుకు ప్రపోజల్స్​ తయారు చేసి నమూనాలను అందించారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.  

ఇదిలాఉంటే వనపర్తి బాయ్స్​ హైస్కూల్​లో సీఎం రేవంత్​రెడ్డి నాల్గవ తరగతి నుంచి టెన్త్​ వరకు చదువుకున్నారు. అలాగే వనపర్తి డిపోకు35 కొత్త బస్సుల మంజూరు చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతిపత్రం అందించారు. జిల్లా కేంద్రం నుంచి యాదగిరిగుట్ట, భద్రాచలం, వేములవాడ, తిరుపతి, శ్రీశైలం, మంత్రాలయం, పుట్టపర్తి, అరుణాచలం వంటి పుణ్యక్షేత్రాలకు, కర్నూల్,  బెంగళూరు, విజయవాడ, నెల్లూరు, చెన్నై, పూణె, ముంబై నగరాలకు రవాణా సౌకర్యం కోసం బస్సులు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోరారు.