అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళ్తున్న తెలంగాణ : ఎమ్మెల్యే మందుల సామేల్

శాలిగౌరారం ( నకిరేకల్ ), వెలుగు : అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దూసుకెళ్లోందని, కాంగ్రెస్​ ఏడాది పాలనలో ఎన్నో పథకాలు, అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. మంగళవారం శాలిగౌరారంలోని సీఎంఆర్ ఫంక్షన్ హాల్​లో లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్  చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు.

 అనంతరం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.  కార్యక్రమంలో తహసీల్దార్ యాదగిరి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాదూరి శంకర్ రెడ్డి, ఎంపీవో పద్మ, డిప్యూటీ తహసీల్దార్ వరప్రసాద్, ఆర్ఐ అజారుద్దీన్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సమరంరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు సుధాకర్, వైస్ చైర్మన్ నర్సింహ, నాయకులు గూని వెంకటయ్య, చింత ధనుంజయ్, వడ్లకొండ పరమేశ్ గౌడ్, నోముల జనార్దన్, కట్టగూరి సురేందర్ రెడ్డి, వేముల గోపీనాథ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గణేశ్​ తదితరులు పాల్గొన్నారు.