ప్రణాళిక బద్ధంగా జీహెచ్ఎంసీ డివిజన్ల అభివృద్ధి : మహిపాల్ రెడ్డి

  • ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

రామచంద్రాపురం, వెలుగు: పటాన్​చెరు సెగ్మెంట్ పరిధిలోని మూడు జీహెచ్​ఎంసీ డివిజన్లను ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం రామచంద్రాపుం డివిజన్​లోని మయూరి నగర్​, శ్రీసాయి కాలనీలో రూ. 61.50 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాలనీలలో మౌలిక సౌకర్యాల ఏర్పాటుకు పెద్దపీట వేస్తున్నామన్నారు. ఇప్పటికే యూజీడీ, తాగునీటి పైప్​లైన్ల పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. కాలనీలలో సమస్యలు ఉంఏట తన దృష్టకి తీసుకురావాలని ఆయా కాలనీల అసోసియేషన్లకు సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పుష్ప, నగేశ్, ఐలేశ్ యాదవ్, జీహెచ్​ఎంసీ అధికారులు, నాయకులు  తదితరులు పాల్గొన్నారు.