రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించండి : మహిపాల్ రెడ్డి

  • మంత్రి సీతక్కను కోరిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

పటాన్​చెరు, వెలుగు: పటాన్​చెరు నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల్లో రోడ్ల నిర్మాణాలు, రహదారుల రిపేర్ల కోసం రూ.60 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరుతూ మంత్రి సీతక్కకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వినతి పత్రం అందించారు. మంగళవారం హైదరాబాద్​లోని సచివాలయంలో మంత్రిని కలిసి నియోజకవర్గంలోని అభివృద్ధి పనులపై  చర్చించారు. 

నియోజకవర్గంలోని గ్రామాల పరిధిలో కొత్త కాలనీలు ఏర్పాటు అవుతున్న తరుణంలో రహదారుల నిర్మాణం అత్యంత ప్రాధాన్యంతో కూడిన అంశమని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కొత్త రహదారుల నిర్మాణానికి రూ. 43 కోట్లు,  ప్రస్తుత రోడ్ల రిపేర్లకు రూ.17 కోట్లు కేటాయించాలని కోరారు.  ఇందుకు మంత్రి  సానుకూలంగా స్పందించి త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.