కాలుష్య పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలి :మహిపాల్ రెడ్డి

రామచంద్రాపురం (పటాన్​చెరు), వెలుగు: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కిష్టయ్యపల్లిలో పరిశ్రమలు విడుదల చేసిన కాలుష్యం వల్ల గేదెలు మృతి చెందడంపై ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మండిపడ్డారు. శనివారం బాధిత రైతులను పరామర్శించి గేదెలు కోల్పోయిన వారికి పరిహారం అందజేశారు. అనంతరం పీసీబీ మండలి మెంబర్​సెక్రటరీ గుగులోత్​కు కాలుష్య కారక పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఫార్మా పరిశ్రమల నిర్లక్ష్యం వల్ల పాడి రైతులకు తీరని నష్టం వాటిల్లిందని, వెంటనే కాలుష్య కారక పరిశ్రమలపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్ని శాఖల అధికారలతో మాట్లాడి బాధిత రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట మాజీ జడ్పీటీసీ కుమార్​ గౌడ్​, విద్యుత్​ శాఖ అధికారులు పాల్గొన్నారు.