మదనాపురంలో కురుమూర్తి లిఫ్ట్​ నీటి విడుదల

మదనాపురం, వెలుగు: రైతుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని దేవరకద్ర ఎమ్మెల్యే  మధుసూదన్ రెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని కురుమూర్తి రాయ ఎత్తిపోతల మోటార్లను ఆన్​చేసి సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్  ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రెండేండ్లుగా ఈ ప్రాజెక్ట్​ పూర్తిగా మరుగున పడిందన్నారు. యుద్ధప్రాతిపదికన లిఫ్ట్  రిపేర్లు చేసి ఆయకట్టుకు సాగునీటిని అందించడం ఆనందంగా ఉందన్నారు. లిఫ్ట్  చైర్మన్  రాజవర్ధన్ రెడ్డి, శేఖర్, గొల్ల రాజు, సత్యనారాయణ గౌడ్, రామచంద్రయ్య, అరుణ్ కుమార్, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.

మక్తల్: సంగంబండ ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తి బుధవారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కర్నాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు సంగంబండ ప్రాజెక్టులో వరద నీరు చేరడంతో పూర్తి స్థాయిలో నిండిందని చెప్పారు. ప్రాజెక్టు కెపాసిటీ కంటే ఎక్కువ నీరు చేరడంతో ఇరిగేషన్​ ఆఫీసర్లతో మాట్లాడి ముందస్తుగా నీటిని దిగువకు విడుదల చేసినట్లు తెలిపారు. మాజీ జడ్పీటీసీ లక్ష్మారెడ్డి, ఇరిగేషన్  ఈఈ మహమ్మద్ హమీద్, గణేశ్, హేమ సుందర్, కృష్ణా రెడ్డి, కేశవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.