హైమన్ డార్ఫ్ వర్ధంతి పాంప్లెంట్ల విడుదల

జైనూర్, వెలుగు: ఆదివాసీల ఆరాధ్య దైవం హైమన్ డార్ఫ్ వర్ధంతికి సంబంధించిన పాంప్లెంట్లను జైనూర్​లో హైమన్ డార్ఫ్ యూత్ అసోసియేషన్ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే కోవ లక్ష్మి విడుదల చేశారు. ఈ నెల 11న జైనూర్​లోని మర్లవాయి గ్రామంలో నిర్వహించనున్న వర్ధంతి సభను సక్సెస్ చేయాలని కోరారు. అనంతరం లబ్ధిదారులకు సీఎంఆర్​ఎఫ్ చెక్కులు అందజేశారు.

జంగం గ్రామంలో జంగో లింగో దీక్షల ప్రారంభోత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సహకార సొసైటీ చైర్మన్ కొడప హన్ను పటేల్, మర్లవాయి రాయి సెంటర్ సార్ మేడి జుగ్నక్ దేవురావు, మాజీ వైస్ ఎంపీపీ చిర్లే లక్ష్మణ్, మాజీ సర్పంచ్​లు మడావి భీంరావు,  కనక ప్రతిభ, ధరంసింగ్ మెస్రం నాగోరావ్, కుమ్ర శ్యాంరావు, బీఆర్ఎస్ సిర్పూర్ యు ప్రెసిడెంట్ ధర్మా రావు పాల్గొన్నారు.