స్టీల్​ బ్యాంక్​లతో ప్లాస్టిక్​ నిర్మూలన : ఎమ్మెల్యే ప్రభాకర్​రెడ్డి

  • ఎమ్మెల్యే ప్రభాకర్​రెడ్డి

దుబ్బాక, వెలుగు: ప్లాస్టిక్​ నిర్మూలన స్టీల్​బ్యాంక్​లతోనే సాధ్యమని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్​రెడ్డి అన్నారు. సోమవారం పట్టణ కేంద్రంలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టీల్​బ్యాంక్​ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుబ్బాకను ప్లాస్టిక్​ రహితంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చని ఆరోగ్యం చెడిపోతే ఏమీచేయలేమన్నారు.

ఫంక్షన్లకు స్టీల్​ వస్తువులను వాడాలని, స్టీల్​బ్యాంక్​ ద్వారా తక్కువ ధరకే వస్తువులను పొందవచ్చన్నారు. భవిష్యత్​లో నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో స్టీల్​బ్యాంక్​ ఏర్పాటు చేయడానికి కృషి చేయాలని నిర్వాహకులను కోరారు.

ఇటీవల ఎన్నికైన దుబ్బాక పద్మశాలి సంఘ కార్యవర్గాన్ని సన్మానించారు. అంతకు ముందు మిరుదొడ్డి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్​ గేమ్స్​ ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్​చైర్మన్​వెంకటయ్య, మున్సిపల్​చైర్​పర్సన్​వనితా, కమిషనర్​ రమేశ్​ కుమార్, ఎంఈవో ప్రభుదాస్​, కౌన్సిలర్​యాదగిరి పాల్గొన్నారు.