నాగర్ కర్నూల్ జూనియర్​ కాలేజీకి కొత్త భవనం కట్టిస్తా : కూచుకుళ్ళ రాజేశ్​ రెడ్డి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : శిథిలావస్థలో ఉన్న నాగర్ కర్నూల్  జూనియర్​  కాలేజీకి కొత్త భవనాన్ని నిర్మిస్తానని ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేశ్​ రెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం నాగర్ కర్నూల్ ఇంటర్మీడియట్ కాలేజీని ఆయన సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాలలో రాణించాలన్నారు.   కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తుందన్నారు.   ఈ కార్యక్రమంలో కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ అనసూయ, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణ, కౌన్సిలర్లు శ్రీనివాసులు, రాజు, నిజాం పాల్గొన్నారు.