మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి : సత్యనారాయణ

  • ఎమ్మెల్యే సత్యనారాయణ 

బెజ్జంకి, వెలుగు: గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ముత్తన్నపేట లక్ష్మీ ఆగ్రో ఇండస్ట్రీలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఎంపీపీ ఆఫీసులో 37 మందికి సీఎంఆర్ఎఫ్,19 మందికి కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.

ప్రాథమిక స్కూల్​లో రూ.8 లక్షల ఎస్​డీఎఫ్​నిధులతో అంగన్వాడీ భవనానికి భూమి పూజ చేశారు. కొత్త గా ఏర్పడిన రామసాగర్ గ్రామపంచాయతీని ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, ఎంపీడీవో ప్రవీణ్, బ్లాక్ కాంగ్రెస్​అధ్యక్షుడు దామోదర్, మండల పార్టీ అధ్యక్షుడు రత్నాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పోచయ్య, శ్రీనివాస్ గౌడ్, రాజు, ప్రభాకర్, సంతోష్,  శ్రీకాంత్, మల్లికార్జున్, మల్లేశం పాల్గొన్నారు.