రైతులకు అండగా ప్రభుత్వం : ఎమ్మెల్యే సత్యనారాయణ

 బెజ్జంకి, వెలుగు: కాంగ్రెస్​ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని మార్కెటింగ్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ ప్రసాద్ రావుతో కలిసి మార్కెట్ యార్డ్ లో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు అధైర్య పడాల్సిన అవసరం లేదని కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నామని పేర్కొన్నారు.

బీఆర్ఎస్ నాయకులు ధాన్యం కొంటలేరని, సర్వే వల్ల పెన్షన్స్ ఆగిపోతాయని, రైతుబంధు రాదని, ఉద్యోగాలు పోతాయని ప్రజలను భయబ్రాంతులకు, అపోహలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. లోపాలను సరిచేసి అందరికీ రైతు భరోసా అందజేస్తామని పేర్కొన్నారు. అంతముందు ఐలేని శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతానికి హాజరయ్యారు. ఏఎంసీ చైర్మన్ కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దామోదర్, మండల పార్టీ అధ్యక్షుడు రత్నాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి , పోచయ్య,  డైరెక్టర్లు మల్లేశం, కుమార్, రాజు,  మార్కెట్ కార్యదర్శి వెంకటయ్య, శ్రీనివాస్ గౌడ్, మల్లికార్జున్, ప్రభాకర్, శరత్, శ్రీనివాస్​ పా ల్గొన్నారు.