పేదల ఆపన్న హస్తం సీఎంఆర్ఎఫ్ : ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

  • ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ 

 బెజ్జంకి, వెలుగు:  పేదల ఆపన్న హస్తం సీఎంఆర్ఎఫ్ అని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీపీ ఆఫీసులో 37 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మూడేళ్ల నుంచి లబ్ధిదారులకు చెక్కులు అందలేదన్నారు. ప్రజాక్షేత్రంలో మాజీ ఎమ్మెల్యేకు ప్రజలు బుద్ధి చెప్పినా అసత్య ఆరోపణలు మానుకోలేదని దుయ్యబట్టారు.

కాంగ్రెస్​ప్రభుత్వం ప్రజా పాలనలో భాగంగా పేదలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దామోదర్, మండల పార్టీ అధ్యక్షుడు రత్నాకర్, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి రెడ్డి, బీసీ సెల్, ఎస్సీ సెల్ అధ్యక్షులు శ్రీకాంత్, శరత్, రాములు, శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ప్రభాకర్, సంతోష్, శంకర్, శ్రీనివాస్, రాజు పాల్గొన్నారు.