ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

ఆమనగల్లు, వెలుగు: పేద ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కోరారు. గురువారం కడ్తాల్ మండల కేంద్రంలో 40 మంది లబ్ధిదారులకు 50 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. అనంతరం తలకొండపల్లి మండలం రామకృష్ణాపురం, మాదాయపల్లి గ్రామాలలోని దుర్గామాతలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

రామకృష్ణాపురం ఆలయం ఆవరణలో నిర్మించనున్న ముఖ ద్వారానికి ఆయన భూమి పూజ చేశారు.  కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ గట్ల కేశవరెడ్డి, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, యాట నర్సింహ, భాస్కర్ రెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.