ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి : కసిరెడ్డి నారాయణరెడ్డి

కల్వకుర్తి, వెలుగు: మహబూబ్​నగర్​ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ సూచించారు. సోమవారం వెల్దండ మండలంలోని ఓ ఫంక్షన్  హాల్​లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం సొంత జిల్లాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో ఉన్న మన్నె జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

భవిష్యత్తులో కాంగ్రెస్  పార్టీ పటిష్టంగా ఉండాలంటే ఎమ్మెల్సీగా కాంగ్రెస్  అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రతిపక్ష పార్టీల ప్రలోభాలకు లొంగకుండా అందరూ ఒకే తాటిపై నిలవాలని కోరారు. జడ్పీ వైస్  చైర్మన్  బాలాజీ సింగ్, నాయకులు భూపతిరెడ్డి, సంజీవ్ యాదవ్, శ్రీనివాస్​ రెడ్డి పాల్గొన్నారు.