ప్రకృతిని ఆరాధించే పండగ తీజ్

ఆమనగల్లు, వెలుగు: గిరిజనులు ప్రకృతిని ఆరాధిస్తూ నిర్వహించుకునే గొప్ప పండుగ తీజ్ ఉత్సవాలు అని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి లు అన్నారు. గురువారం  కడ్తాల్ మండలం గానుగుమర్ల తండాలో నిర్వహించిన తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్నారు.  మొలకల బుట్టలు నెత్తిన పెట్టుకొని గిరిజన మహిళలు, చిన్నారులతో కలిసి ఊరేగింపుగా వెళ్లారు.

అనంతరం వారు మాట్లాడుతూ..  బంజారాల బతుకమ్మ తీజ్ పండుగని, గిరిజనులందరూ కలిసి సాంప్రదాయాలతో పండుగను ఘనంగా నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ప్రవీణ్ కుమార్, నాయకులు దశరథ్ నాయక్, విజితా రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.