మహిళా సంఘాలకు ఆర్థిక చేయూత : ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి 

 కల్వకుర్తి, వెలుగు:  ఇందిరా మహిళా శక్తి క్రాంతి పథకం ద్వారా ప్రభుత్వం మహిళలకు ఆర్థికంగా చేయూత కల్పిస్తోందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. సోమవారం వెల్దండ మండల కేంద్రంలో ఇందిరా క్రాంతి శక్తి పథకం కింద వినయ్ కోడి పిల్లల మదర్ యూనిట్​ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించేందుకు ముందుంటుందన్నారు.

ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళ సంఘాల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. మొదటి విడతగా 16 మహిళా సంఘాలకు 50 లక్షల 6 వేల రూపాయలు మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు సుధాకర్, ఆర్డీవో శ్రీనివాస్, మాజీ సర్పంచ్ భూపతిరెడ్డి, మోతీలాల్ మహిళా సంఘాల లబ్ధిదారులు భారతమ్మ, బంగారమ్మ, జ్యోతి, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.