అన్ని ప్రాంతాలకు బస్సులు నడిపిస్తాం : కసిరెడ్డి నారాయణరెడ్డి

కల్వకుర్తి, వెలుగు: నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు బస్సులు నడిపేలా కృషి చేస్తానని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం కల్వకుర్తి నుంచి మద్దిమడుగుకు జెండా ఊపి ఆర్టీసీ బస్సును ఆయన ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

అనంతరం పట్టణంలోని మినీ స్టేడియంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఉమ్మడి జిల్లా ఫుట్​బాల్ క్రీడలను ప్రారంభించారు. అంతకుముందు పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్ఎం శ్రీదేవి, డీఎం సుభాషిణీ, నాయకులు ఆనంద్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, ఎజాజ్, శ్రీనివాసులు, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.