ఎస్సీ హాస్టల్​ తనిఖీ చేసిన ఎమ్మెల్యే హరీశ్​రావు

సిద్దిపేట టౌన్, వెలుగు: సిద్దిపేట పట్టణంలోని ఎస్సీ హాస్టల్ ను గురువారం ఎమ్మెల్యే, మాజీమంత్రి హరీశ్​రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టూడెంట్ల సమస్యలను తెలుసుకొని వారితో సహపంక్తి భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మెస్​చార్జీలు రాక స్టూడెంట్స్​అర్ధాకలితో ఉంటున్న విషయం సీఎం, డిఫ్యూటీ సీఎంకి కనిపించడం లేదా అన్నారు.

ఈ విద్యా సంవత్సరంలో స్టూడెంట్స్​కు ఇంకా టవల్స్, షూస్ ఇవ్వలేదని, 8 నెలల నుంచి ఔట్​సోర్సింగ్, వాచ్​మెన్​లకు జీతాలు ఇవ్వడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలంటే ఎందుకు అంత చిన్న చూపు అని ప్రశ్నించారు. కార్యక్రమంలో రాజనర్సు, రాధాకృష్ణ శర్మ, సంపత్ రెడ్డి, రవీందర్ రెడ్డి, నాగరాజు రెడ్డి, మల్లికార్జున్, తిరుమలరెడ్డి, సాయి ఈశ్వర్ గౌడ్ పాల్గొన్నారు.