నీటి విడుదలకు ప్రణాళికలు సిద్ధం చేయండి : హరీశ్ రావు

  • అధికారులకు హరీశ్ రావు సూచన

సిద్దిపేట, వెలుగు: రంగనాయక సాగర్ లో నీటి పంపింగ్ జరుగుతున్న నేపథ్యంలో కాల్వలకు నీరు వదిలేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఇరిగేషన్ అధికారులను కోరారు. ఆదివారం సిద్దిపేట ఇరిగేషన్ ఎస్ఈ బస్వరాజ్, ఈఈ గోపాల కృష్ణ తో హరీశ్ రావు  ఫోన్ లో మాట్లాడారు.  ప్రస్తుతం రంగనాయక సాగర్ లో 2.3 టీఎంసీ నీరుందని, పూర్తి స్థాయిలో 3టీఎంసీల నీటిని నింపాలని కోరారు. రిజర్వాయర్ కెనాల్స్ లో మట్టి, గడ్డి, తుంగ పేరుకుపోయిందని వెంటనే వాటిని  తొలగించి కాల్వల్లోకి నీటిని విడుదల చేయాలని అధికారులను కోరారు. 

అనంతరం  రంగనాయక సాగర్ రిజర్వాయర్ లో నీటి పంపింగ్ స్వయంగా వెళ్లి పరిశీలించారు. సిద్దిపేట పట్టణం లోని రూరల్ పీఎస్​చౌరస్తాలో దాసాంజనేయ స్వామి దేవాలయ విగ్రహ పునః ప్రతిష్టా కార్యక్రమం లో పాల్గొన్న మాజీ మంత్రి  హరీశ్ రావు పాల్గొని ప్రత్యేక  పూజలు నిర్వహించారు. తన వంతుగా   రూ.2 లక్షల విరాళం అందజేశారు.   

సిద్దిపేట అర్బన్ మండలం  పొన్నాల గ్రామం లో  శ్రీ ముత్యాల పోచమ్మ దేవాలయ విగ్రహా ప్రతిష్టాపన కార్యక్రమంలో  మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొని పూజలు నిర్వహించారు.  ఈ సందర్బంగా మాట్లాడుతూ గ్రామం లో అందరు కలసి నిర్వహిస్తున్న ముత్యాలమ్మ వారి విగ్రహా ప్రతిష్ట చేయడం చాలా సంతోషం గా ఉంది అన్ని కులాల భాగస్వామ్యం కావడం ఇంత అద్భుతం గా నిర్వహించిన నిర్వహకులకి శుభాకాంక్షలు తెలిపారు. 

సీఎంఆర్ చెక్కుల పంపిణీ

సిద్దిపేట క్యాంప్ ఆఫీసులో 229 మందికి 56 లక్షల సీఎం సహాయ నిధి చెక్కుల ను హరీశ్​ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణకు కాంగ్రెస్, బీజేపీ అన్యాయం చేస్తున్నాయని, ఆరు గ్యారంటీలతో అబద్ధాలు చెప్పి అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసగిస్తోందని మండిపడ్డారు. మేడిగడ్డలో రెండు పిల్లర్స్ కూలిపోతే కాళేశ్వరం మొత్తం కూలి పోయిందంటే   రంగనాయక సాగర్ లోకి  నీళ్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. త్వరలోనే సిద్దిపేట నియోజకవర్గంలో ప్రతి చెరువు, కుంటను గోదావరి జలాలతో నింపుతామని వెల్లడించారు.