బెల్లంపల్లి సెగ్మెంట్ లో రూ. 3.33 కోట్ల పనులు : ఎమ్మెల్యే గడ్డం వినోద్

  • వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే గడ్డం వినోద్  

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలంలోని కేజీబీవీ స్కూల్ లో రూ. 3.25 కోట్ల నిధులతో అదనపు తరగతుల నిర్మాణం, చర్లపల్లిలో రూ. 8లక్షలతో నూతన స్కూల్ నిర్మాణానికి ఎమ్మెల్యే గడ్డం వినోద్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వినోద్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేలా కృషి చేస్తున్నారని ప్రశంసించారు. 

బీసీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గీతా కార్మికులకు కాటమయ్య రక్ష పథకంలో ఎమ్మెల్యే వినోద్  సేఫ్టీ కిట్లను  పంపిణీ చేశారు. గీత కార్మికుల సంక్షేమ కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమాల్లో ఎంపీటీసీలు ముడిమడుగుల మహేందర్, బొమ్మెన హరీశ్ గౌడ్, టీఎస్డబ్ల్యూ ఐడీసీ ఈఈ అశోక్ కుమార్, డీఈ శ్రీనివాస్, ఏఈ గుండేటి వినయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నాతరి స్వామి, జుమ్మిడి బానయ్య, రాజన్న, ఇప్ప రవి తదితరులు పాల్గొన్నారు.