దళారులను నమ్మొద్దు : జి.మధుసూదన్ రెడ్డి

  • ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి

మదనాపురం వెలుగు:  ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్లలో వరి ధాన్యం విక్రమించుకోవాలని ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి సూచించారు. శనివారం రామన్ పాడు గ్రామంలోని ఐకేపీ సింగిల్ విండో ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  రైతుల కష్టాలను దృష్టిలో పెట్టుకొని క్వింటాలుకు రూ. 500 బోనస్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందన్నారు.  

రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేసి ఆదుకుంటామన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.  కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ ప్రశాంత్, వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి జగదీశ్, వడ్డే కృష్ణ వెంకట్ నారాయణ, శ్రీధర్ రెడ్డి, అంజద్ అలీ అధికారులు పాల్గొన్నారు.