తాగు నీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలి : డా. వంశీకృష్ణ

  • అచ్చంపేట ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ  

అచ్చంపేట, వెలుగు: అచ్చంపేట నియోజకవర్గంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అధికారులను ఆదేశించారు. ఆదివారం అచ్చంపేటలో మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గానికి మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న తాగునీటిని పట్టణంతోపాటు, ఇతర మండలాల్లోని గ్రామాల్లో సరఫరా చేయాలన్నారు. పైప్​లైన్ల లీకేజీల మరమ్మతులు త్వరతిగతిన పూర్తి చేసేందుకు మిషన్ భగీరథ సిబ్బందితోపాటు మున్సిపల్ అధికారులు కృషి చేయాలని కోరారు. 

కార్యక్రమంలో మిషన్ భగీరథ డీఈ హేమలత, ఏఈలు మధుబాబు, బాలరాజు, సందీప్, సాయి కృష్ణ, నేతలు బిచ్యా నాయక్, బలరాం, మంగ్య నాయక్, ఆర్టీసీ నేతలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆర్టీసీ టీఎంయూ నేత మోహన్ లాల్ సంస్మరణ సభలో పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి మోహన్ లాల్ చేసిన కృషిని ఎమ్మెల్యే కొనియాడారు.