రంగాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

  •  దళారులను నమ్మి మోసపోవద్దు: ఎమ్మెల్యే వంశీకృష్ణ 

వంగూరు, వెలుగు:  వంగూరు మండలంలోని రంగాపూర్ గ్రామంలో  సింగిల్ విండో సొసైటీ ఆధ్వర్యంలో  ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గురువారం ప్రారంభించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ..  సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం వ్యవసాయ రంగంతో పాటు అన్ని రంగాల్లో దూసుకుపోతుందన్నారు.  గ్రేడ్ వన్ వడ్లకు 2320, రూ. సాధారణ వడ్లకు రూ. 2300, సన్న వడ్లకు రూ. 500 బోనస్ గా చెల్లించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

త్వరలోనే రైతులందరికీ రైతు భరోసాతో పాటు రైతు రుణమాఫీని ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు.  రైతులు దళారులను నమ్మి మోసపోవద్దన్నారు.  ఉల్లంపల్లి గ్రామంలో వాల్మీకి జయంతి వేడుకలకు ఎమ్మెల్యే హాజరై వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.  సింగిల్ విండో చైర్మన్ సురేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ బాలస్వామి, సీఈఓ విష్ణుమూర్తి, కాంగ్రెస్ పార్టీ మండల ప్రచార కమిటీ చైర్మన్ పాండురంగారెడ్డి, రమేశ్ గౌడ్, బక్కయ్య, సలేశ్వరం, శేఖర్, రాజశేఖర్ రెడ్డి, లాలు యాదవ్, కృష్ణారెడ్డి, శంకర్ యాదవ్  పాల్గొన్నారు.