తిమ్మప్ప దేవాలయంలో ఎమ్మెల్యే పూజలు

నారాయణపేట, వెలుగు: మండలంలోని ఎక్లాస్​పూర్  గ్రామంలో తిమ్మప్పస్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ ధర్మ కర్త మానిక్ శాస్త్రి పూర్ణకుంభంతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. వేద పండితులు ఆశీర్వదించి పూలమాల, శాలుశాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందచేశారు. లయన్స్  క్లబ్  గవర్నర్  హరినారాయణ బట్టడ్, కాంగ్రెస్  పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండీ సలీం, శ్రీనివాస్ లాహోటి, కాట్రగడ్డ విజయకుమార్, జమునా బాయి, ఎంపీటీసీ రాంరెడ్డి, సాయినాథ్, రవి గౌడ్, జనార్దన్  పాల్గొన్నారు.