కొండారెడ్డిపల్లిలో దసరాలోగా పనులు కంప్లీట్​ చేయాలి : ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

వంగూరు, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి దసరా రోజు కొండారెడ్డిపల్లికి వస్తున్న సందర్భంగా అభివృద్ధి పనులన్నీ కంప్లీట్​ చేయాలని అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ అధికారులను ఆదేశించారు. శుక్రవారం వివిధ శాఖల అధికారులతో కలిసి కొండారెడ్డిపల్లిలో పర్యటించి  లైబ్రరీ, పాలశీతలీకరణ కేంద్రం, గ్రామ పంచాయతీ, బీసీ కమ్యూనిటీ హాల్, వెటర్నరీ హాస్పిటల్, రైతువేదిక పనులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

హెలిప్యాడ్  స్థలాన్ని పరిశీలించారు. అనంతరం అధికారులు, కాంట్రాక్టర్లతో కొండారెడ్డిపల్లి గ్రామపంచాయతీ ఆఫీస్​లో సమావేశం నిర్వహించారు. రోడ్ల విస్తరణ, లైటింగ్, సోలార్  విద్యుత్  వంటి పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. దసరా నాటికి కొండారెడ్డిపల్లి గ్రామం మోడల్  విలేజ్​గా తీర్చిదిద్దాలని సూచించారు. మంద పాండురంగారెడ్డి, వేమారెడ్డి, స్పెషల్  ఆఫీసర్  మణిపాల్ నాయక్, సీఐ విష్ణువర్ధన్ రెడ్డి, నారాయణరెడ్డి, అనిల్, నాయిని జైపాల్, శివశంకర్, చందు పాల్గొన్నారు.