నల్లమలను డెవలప్​ చేస్తాం : ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

అమ్రాబాద్, వెలుగు: నల్లమల ప్రాంతాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. సోమవారం మన్ననూర్  లింగమయ్య ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్రాబాద్  మండలం సబ్ స్టేషన్  ఆవరణలో  ట్రాన్స్​ఫార్మర్  రిపేర్​ సెంటర్​కు భూమిపూజ చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేక చొరవతో అమ్రాబాద్ కు ఈ సెంటర్  మంజూరైందని చెప్పారు. అమ్రాబాద్, పదర మండలాల పరిధిలో5 సబ్ స్టేషన్లు ఉన్నాయని, వీటికి విద్యుత్​ సప్లై కోసం సింగిల్  లైన్​ ఉందని, మరో లైన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

శ్రీశైలం,- హైదరాబాద్ హైవేపై రూ.7,700 కోట్లతో మన్ననూర్  నుంచి దోమలపెంట వరకు ఎలివేటెడ్  కారిడార్  మంజూరైందని తెలిపారు. భూత్పూర్  నుంచి మద్దిమడుగు వరకు రోడ్డు మంజూరైనట్లు చెప్పారు. మార్కెట్  వైస్  చైర్మన్  ఆర్  వెంకటయ్య, మాజీ ఎంపీపీ శ్రీనివాసులు, ట్రాన్స్​కో ఏడీ శ్రీనివాసులు, ఏఈ రమేశ్ నాయక్, ముబారక్, ఆంజనేయులు 
పాల్గొన్నారు.