రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

వంగూర్, వెలుగు : ఏడాదిలోనే ప్రజా ప్రభుత్వానికి రైతుల పక్షపాతిగా గుర్తింపు వచ్చిందని అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. ఆదివారం మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ ఆధ్వర్యంలో రైతులకు స్పింక్లర్లు, పైపులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ఏకకాలంలో రైతులకు రూ2 లక్షల రుణమాఫీ చేసి అండగా నిలిచిందన్నారు.

రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనునిత్యం కృషి చేస్తుందని, సంక్రాంతి తరువాత రైతు భరోసా ఇస్తామని తెలిపారు. ప్రతిపక్షాల మాటలు నమ్మి రైతులు ఎవరు ఆందోళనకు గురి కావద్దని సూచించారు. రాష్ట్ర వ్యవసాయ కమిషన్  సభ్యుడు కేవీఎన్ రెడ్డి, హార్టికల్చర్  జిల్లా అధికారి జగన్, పీఏసీఎస్​ డైరెక్టర్  పాండురంగారెడ్డి, ఎనుముల వేమారెడ్డి, తిరుమలయ్య, దొడ్డి విష్ణు, కృష్ణారెడ్డి, ముత్యాల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

అమ్రాబాద్ : అచ్చంపేట మున్సిపాలిటీని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. పట్టణంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అయ్యప్ప మాలధారణ అనంతరం పడిపూజలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. 14వ వార్డులో రూ.16 లక్షల వ్యయంతో నిర్వహించే డ్రైనేజీ స్లాబ్  నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

సోమవారం సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా గ్రామాల్లో తెలంగాణ ప్రజాపాలన విజయోత్సవ ర్యాలీలు నిర్వహించి, అచ్చంపేటలో జరిగే ర్యాలీలో పాల్గొనాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మున్సిపల్  చైర్మన్  గార్లపాటి శ్రీనివాసులు, కౌన్సిలర్లు, కో ఆప్షన్  సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.