రైతులకు పరిహారం చెల్లిస్తాం : ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

  • ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి 

మిర్యాలగూడ, వెలుగు : అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం చెల్లిస్తామని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు. గురువారం వేములపల్లి, మాడుగుల పల్లి మండలాల్లో పర్యటించి అకాల వర్షాలతో  దెబ్బతిన్న పంటలను అధికారులతో కలిసి పరిశీలించారు. పంటలు దెబ్బతిన్న తీరును... కలెక్టర్ కు వీడియో కాల్ ద్వారా చూపించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. అగ్రికల్చర్ ఆఫీసర్లు పంట నష్టపోయిన రైతుల వివరాలను అప్డేట్ చేసి ప్రభుత్వానికి పంపించాలన్నారు. ఆయన వెంట వ్యవసాయ అధికారి సైదా నాయక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తమ్మడ బోయిన అర్జున్, కృపయ్య, సందీప్ఉన్నారు.