ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

మిర్యాలగూడ, వెలుగు : ప్రజల సామాజిక భద్రత, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తమ్మడ బోయిన అర్జున్ తో కలిసి గురువారం వేములపల్లి మండలం సల్కునూరు క్రాస్ రోడ్డు వద్ద భీమారం– సూర్యాపేట ప్రధాన రహదారిని ఆయన పరిశీలించారు. ఈ రహదారిపై ఏర్పడిన గుంతల కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతుండడంతో మరమ్మతులు చేయించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రయాణికులు నిత్యం ఇబ్బందులు పడుతున్నట్లు తన దృష్టికి రావడంతో తక్షణమే సమస్యను పరిష్కరించినట్లు చెప్పారు. నియోజకవర్గంలో ఏ సమస్య తలెత్తినా తన దృష్టికి తీసుకురావాలని, వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట నేతలు, అధికారులు ఉన్నారు.