
మిర్యాలగూడ, వెలుగు: మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో శానిటేషన్ తీరును ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి శనివారం ఉదయం పరిశీలించారు. కార్మికులు, ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. గాంధీనగర్ 34, 35వ వార్డుల్లో శానిటేషన్ వెహికల్ నడిపి, చెత్త సేకరించారు.
గణేశ్ మార్కెట్లో వ్యాపారులతో మాట్లాడారు. ఎమ్మెల్యే స్వయంగా వచ్చి, సమస్యలు తెలుసుకోవడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.