తెగిన కాలువలకు రిపేర్లు చేయండి : బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

గద్వాల, వెలుగు : తెగిన కాలువలకు వెంటనే రిపేర్లు చేయాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం కేటిదొడ్డి మండలంలోని పాతపాలెం, నీలహరి గ్రామాల మధ్య తెగిపోయిన కాలువను పరిశీలించారు. 

కాలువ తెగిపోవడంతో రోడ్డు దెబ్బతిన్నదని, దీంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలకు రైతులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వెంటనే రిపేర్లు చేసి రాకపోకలను పునరుద్ధరించాలని, పంట కాలువలకు నీళ్లివ్వాలని ఆదేశించారు.