వైద్యంతో పాటు ఈ మంత్రం చ‌దివితే క‌రోనా ప‌రార్..

వైద్యంతో పాటు ఈ మంత్రం చ‌దివితే క‌రోనా ప‌రార్..

క‌రోనా కు భ‌య‌ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నారు. మ‌నోధైర్యంతో క‌రోనా ను జ‌యించ‌వ‌చ్చ‌ని అన్నారు హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాల‌కృష్ణ‌. నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన బాల‌య్య ప్ర‌జ‌ల‌నుద్దేశించి ప్ర‌సంగించారు. క‌రోనా మ‌న‌కు అంట‌లేద‌ని మాన‌సికంగా ధైర్యంగా ఉండాల‌న్నారు. వైద్యంతో పాటు నారాయ‌ణ మంత్రం, బాల త్రిపురాసుంద‌రి మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే కరోనా దగ్గరకు రాదని చెప్పారు. ఎమ్మెల్యే బాల‌కృష్ణ స్వ‌యంగా మంత్రాన్ని ఉచ్చ‌రించి ప్ర‌జ‌ల్లో ధైర్యాన్ని నింపే ప్ర‌య‌త్నం చేశారు.