పదోతరగతి పరీక్ష రాసిన ఒడిశా ఎమ్మెల్యే

పదోతరగతి పరీక్ష రాసిన ఒడిశా ఎమ్మెల్యే

ఒడిశా ఎమ్మెల్యే పదో తరగతి పరీక్షలు రాశారు. ఈ రోజు(శుక్రవారం) నుంచి ఒడిశాలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే పూర్ణచంద్ర స్వైన్ కూడా ఓ విద్యార్థిలాగా పదో తరగతి పరీక్ష రాశారు. ఆయన దూరవిద్య విధానంలో టెన్త్ క్లాస్ చదివారు. కరోనా కారణంగా ఒడిశా ప్రభుత్వం ఈ ఏడాది అందరినీ పాస్ చేసింది. తాము కేటాయించిన మార్కులు నచ్చనివారు పరీక్షలు రాసే అవకాశాన్ని కల్పించింది. దీంతో ఎమ్మెల్యే పూర్ణచంద్ర ఎక్కువ మార్కుల కోసం పరీక్షలు రాయాలని నిర్ణయించుకున్నారు.

సూరాడలోని బాలికల ఉన్నతపాఠశాల పరీక్ష కేంద్రానికి ఓ బైక్ పై సాధారణ వ్యక్తిలా వచ్చారు ఎమ్మెల్యే. మరో బైక్ పై సెక్యూరిటీ సిబ్బంది కూడా పరీక్ష సెంటర్ దగ్గరకు వచ్చారు. కరోనా క్రమంలో థర్మల్ స్క్రీనింగ్ చేసిన అక్కడి సిబ్బంది ఆయనను పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు.

సూరాడ నియోజకవర్గం నుంచి పూర్ణచంద్ర మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.