మైసమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా : ఎమ్యెల్యే అనిరుధ్​​రెడ్డి

నవాబుపేట, వెలుగు: మైసమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని జడ్చర్ల ఎమ్యెల్యే అనిరుధ్​​రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని కాకర్లపహాడ్ గ్రామపంచాయతీ పరిధిలోని పర్వతాపూర్ మైసమ్మ ఆలయ నూతన పాలకవర్గ  కమిటీ చైర్మన్, పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నూతన చైర్మన్​గా కాకర్లపహాడ్ కు చెందిన సీనియర్ నాయకుడు జగన్మోహన్​రెడ్డితోపాటు 9  మంది డైరెక్టర్లు ఎమ్మెల్యే సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. 

ఈసందర్భంగా ఎమ్మెల్యే పాలకమండలి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. తన ఎన్నికల ప్రచారం ఇక్కడి నుంచే ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. అమ్మవారి ఆశీస్సులతోనే ఎమ్మెల్యేగా గెలిచానని, ఆలయానికి సంబంధించిన 5ఎకరాల స్థల వివాదం విషయాన్ని అసెంబ్లీలో  ప్రస్తావించానని, త్వరలోనే అటవీ, దేవాదాయశాఖ అధికారులతో చర్చించి స్థలాన్ని ఆలయానికి చెందేలా చేస్తామన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు జనంపల్లి దుశ్యంత్​రెడ్డి, పార్టీ మండలాధ్యక్ష్యుడు రాంచంద్రయ్య, మార్కెట్ చైర్మన్ హరలింగం, వైస్​చైర్మన్​ తుల్సీరాంనాయక్, నాయకులు తదితరులు పాల్గొన్నారు