జీపీ బిల్డింగ్​లను ప్రారంభించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

బాలానగర్, వెలుగు: మండలంలోని మన్నెగూడెం, పెద్దబాయితండాలో కొత్తగా నిర్మించిన గ్రామ పంచాయతీ బిల్డింగ్​లను బుధవారం జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రారంభించారు. గ్రామ పంచాయతీ ఆవరణలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలను నాటారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం కొత్త జీపీ బిల్డింగ్​లను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. ప్రజా పాలన ద్వారా ప్రజలకు మరింత సేవలందిస్తామని తెలిపారు.