విద్యార్థులకు షూ ల పంపిణీ : ఎమ్మెల్యే  అనిరుధ్ రెడ్డి

మిడ్జిల్ వెలుగు : మిడ్జిల్ మండలంలోని దోనూర్, వల్లభరావు పల్లి, అయ్యవారిపల్లి, వాడ్యాల, వేముల, మిడ్జిల్, బోయిన్ పల్లి ప్రభుత్వ పాఠశాలల్లో  విద్యార్థులకు ఎమ్మెల్యే  అనిరుధ్ రెడ్డి శనివారం బూట్లను పంపిణీ చేశారు.  జడ్చర్ల నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన సుమారు 27 వేల మంది విద్యార్థులకు  షూలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. వచ్చే ఏడాది స్కూల్​ బ్యాగ్​లు, వాటర్​ బాటిళ్లు ఇస్తామని  చెప్పారు.