అవి అడవులకే కొత్త అందాన్ని తెచ్చాయి

అవి అడవులకే కొత్త అందాన్ని తెచ్చాయి

చుట్టూ ఎత్తైన గుట్టలు.. ఎటు చూసినా పచ్చని వాతావరణం.. పక్షుల కువకువలు, గలగల పారే సెలయేటి సవ్వళ్లు.. అడవి తల్లి ఒడిలో ఆదివాసుల పల్లెలు.. ఇలాంటి ఎన్నో అందాలకు కేరాఫ్‌‌‌‌ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని అడవులు. ఈ సీజన్‌‌‌‌ స్పెషల్ ఎట్రాక్షన్‌‌‌‌ అక్కడున్న జలపాతాలు. అవి అడవులకే కొత్త అందాన్ని తెచ్చి పెట్టాయి.

వర్షాలకు జిల్లాలోని జలపాతాలన్నీ నీళ్లతో కళకళలాడుతున్నాయి. తిర్యాణి మండలంలోని గుండాల, చింతలమాదర, చెచ్చెర, లింగాపూర్ మండలంలోని మిట్టె జలపాతం,ఆసిఫాబాద్‌‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమతుల గుండం జలపాతం, జోడేఘాట్ దగ్గరలో బాబేఘరి జలపాతాలకు ఇప్పటికే టూరిస్ట్‌‌ల రద్దీ పెరిగింది.  
- మసాదే సంతోష్ కుమార్, ఆసిఫాబాద్, వెలుగు