బీజేపీలో చేరిన బాలీవుడ్ వెటరన్ హీరో మిథున్ చక్రవర్తి

బీజేపీలో చేరిన బాలీవుడ్ వెటరన్ హీరో మిథున్ చక్రవర్తి

కోల్‌‌కతా: బాలీవుడ్ వెటరన్ హీరో, ఫ్యాన్స్ ముద్దుగా డిస్కో డ్యాన్సర్ అని పిలుచుకునే మిథున్ చక్రవర్తి ఊహించినట్లుగానే బీజేపీలో చేరారు. కోల్‌‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌‌లో జరుగుతున్న మోడీ ర్యాలీలో కాషాయ కండువా కప్పుకున్నారు మిథున్ చక్రవర్తి. బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్, పార్టీ రాష్ట్ర ఇన్‌‌ఛార్జ్ కైలాష్ విజయవర్గీయ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్, నందిగ్రామ్ అభ్యర్థి సువేందు అధికారిల సమక్షంలో మిథున్ కమల తీర్థం పుచ్చుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ మాజీ నేత అయిన మిథున్‌కు దిలీప్ ఘోష్, కైలాష్ విజయవర్గీయలు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శనివారం బీజేపీలో చేరిన తృణమూల్ రాజ్యసభ ఎంపీ దినేష్ త్రివేదీ కూడా ఈ మీటింగ్‌‌కు హాజరయ్యారు.