భారత్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో న్యూజిలాండ్ తుది జట్టు ఊహకు అందడం లేదు. తొలి టెస్ట్ నుండి ఆ జట్టు బౌలింగ్ లో చేస్తున్న మార్పులు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. మ్యాచ్ గెలవడమే మాకు ముఖ్యం.. పిచ్ కు తగ్గట్టుగా ప్లేయర్లను ఎంపిక చేయడం మా ఉద్దేశ్యం అన్నట్టు కివీస్ సిరీస్ లో ముందుకు సాగుతుంది. బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగింది. భారత్ లాంటి పిచ్ లపై ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగడంతో చాలా మంది షాకయ్యారు. మరోవైపు భారత్ మాత్రం ఇద్దరు పేసర్లతోనే బరిలోకి దిగింది.
ఈ విషయంలో కివీస్ తీసుకున్న ఈ నిర్ణయం వారికి బాగా కలిసి వచ్చింది. పిచ్ మీద తేమను ఉపయోగించుకొని భారత్ ను 46 పరుగులకే ఆలౌట్ చేశారు. ఇదే ఊపులో తొలి టెస్టులో విజయం సాధించారు. పూణే వేదికగా జరిగిన రెండో టెస్ట్ విషయానికి వస్తే భారత్ పై అద్భుత ప్రదర్శనతో మొత్తం 8 వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ హెన్రీని పక్కన పెట్టి ఆల్ రౌండర్ సాంట్నర్ ను తీసుకొచ్చారు. కివీస్ చేసిన కీలక మార్పు పని చేసింది. పూణే టెస్టులో సాంట్నర్ ఏకంగా 13 వికెట్లు తీసి ఒంటి చేత్తో న్యూజిలాండ్ కు విజయాన్ని అందించాడు.
Also Read : మూడేండ్లకే ఫిడే రేటింగ్
ప్రస్తుతం జరుగుతున్న ముంబై టెస్టులో సాంట్నర్ స్థానంలో స్పెషలిస్ట్ స్పిన్నర్ సోధీని తుది జట్టులోకి తీసుకొని వచ్చారు. ఒక టెస్టులో 13 వికెట్లు తీసినా ఆ బౌలర్ ను తర్వాత టెస్టులో కొనసాగించకపోవడం కివీస్ కే చెల్లింది. వేరే ఏ జట్టు కూడా ఈ సాహసం చేయకపోవచ్చు. సాంట్నర్ గాయం అని చెప్పినా.. అది నమ్మలేం. మరోవైపు సౌథీ స్థానంలో హెన్రీ వచ్చాడు. హెన్రీ రోహిత్ శర్మ వికెట్ తీశాడు. ఇలా పిచ్ కు తగ్గట్టుగా న్యూజిలాండ్ చేస్తున్న మార్పులకు ప్రశంసలు దక్కుతున్నాయి.
ఈ టెస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 235 పరుగులకు ఆలౌటైంది. ప్రస్తుతం భారత్ తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. క్రీజ్ లో పంత్ (55), గిల్ (61) ఉన్నారు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో ఇంకా 65 పరుగులు వెనకబడి ఉంది.
Mitchell Santner not playing ?
— Dinda Academy (@academy_dinda) November 1, 2024
Blud came in India just to play the Pune Test which was rank turner pic.twitter.com/oBvrFc56Qi