New Zealand cricket: విలియంసన్ స్థానంలో న్యూజిలాండ్ జట్టుకు కొత్త కెప్టెన్

న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వన్డే,టీ20 లకు కొత్త కెప్టెన్ ను ప్రకటించింది. ఆల్ రౌండర్ మిచెల్ సాంట్నర్ ను వైట్ బాల్(వన్డే, టీ20)  ఫార్మాట్ కు పూర్తి స్థాయి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. బుధవారం (డిసెంబర్ 18) న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. కేన్ విలియంసన్ స్థానంలో సాంట్నర్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరిస్తాడు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ తర్వాత విలియమ్సన్ కెప్టెన్సీకి రాజీనామా చేయడంతో పాటు సెంట్రల్ కాంట్రాక్ట్ వద్దనుకున్నారు. 

ప్రస్తుతం టెస్ట్ జట్టుకు టామ్ లేతమ్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ తరపున సాంట్నర్ మూడు ఫార్మాట్ లలో 243 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. 24 టీ20లతో పాటు నాలుగు వన్డేల్లో కివీస్ జట్టుకు కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది. "వైట్-బాల్ ఫార్మాట్ కు కెప్టెన్ గా తనకు ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని.. ఈ బాధ్యతలు స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని సాంట్నర్ తెలిపాడు. 

Also Read :- 89 పరుగులకే ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ డిక్లేర్

"ఇది నాకు చాలా గొప్ప గౌరవం. చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు న్యూజిలాండ్‌కు ఆడాలని కలలు కనేవాడిని. అధికారికంగా నా దేశాన్ని రెండు ఫార్మాట్లలో నడిపించే అవకాశం దక్కడం గౌరవంగా భావిస్తున్నాను. ఇది నాకు కొత్త ఛాలెంజ్ తో కూడుకున్నది". అని కెప్టెన్ గా ప్రకటించగానే సాంట్నర్ అన్నాడు. ఫిబ్రవరిలో పాకిస్తాన్‌లో జరిగే జరగబోయే ముక్కోణపు సిరీస్‌తో సాంట్నర్ పూర్తి స్థాయిలో తన కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరిస్తాడు. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది.