శ్రీలంకపై జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్ వికెట్ కీపర్ మిచ్ హే ఆల్ టైం రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. రంగి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఐదు 5 క్యాచ్ లతో పాటు ఒక స్టంపింగ్ చేసి ఆరుగురు ఆటగాళ్లను ఔట్ చేయడంలో భాగస్వామ్యం పంచుకున్నాడు. దీంతో టీ20 క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్ లో ఎక్కువ మందిని ఔట్ చేసిన వికెట్ కీపర్ గా ఆల్ టైం రికార్డ్ సృష్టించాడు.
ఈ మ్యాచ్ లో మిచ్ హే కుశాల్ పెరీరా, అసలంక, రాజపక్స, వెళ్లలాగే, తీక్షణ క్యాచ్ లను అందుకున్నాడు. పతిరాణాను స్టంపింగ్ చేశాడు. ఇప్పటివరకు ఈ రికార్డ్ భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉంది. అతను 2018 లో బ్రిస్టల్ లో జరిగిన టీ20 మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై 5 క్యాచ్ లను అందుకున్నాడు. ధోనీతో పాటు మహ్మద్ షాజాద్,ఇర్ఫాన్ కరీం,కిప్లిన్ డోరిగా సంయుక్తంగా 5 గురు ఆటగాళ్లను ఔట్ లలో ఔట్ చేసిన వికెట్ కీపర్లుగా రెండో స్థానంలో నిలిచారు.
ALSO READ | KL Rahul: ప్రపంచ క్రికెట్‌లో ఆ ప్రత్యేకత రాహుల్‌కే సొంతం: గంభీర్
ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 19.3 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌట్ అయింది. హసరంగా 4 వికెట్లు తీసి సత్తా చాటగా.. ఫాస్ట్ బౌలర్ పతిరానా 3 వికెట్లతో నిప్పులు చెరిగాడు. లక్ష్య ఛేదనలో శ్రీలంక 103 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 5 పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలిచి రెండు టీ20 మ్యాచ్ ల సిరీస్ ను 1-1 తో సమం చేసింది.
A new record set by New Zealand's Mitch Hay - the first player to make six fielding dismissals in a T20I ?
— ESPNcricinfo (@ESPNcricinfo) November 10, 2024
The wicketkeeper took five catches and made one stumping in their win against Sri Lanka in Dambulla #SLvNZ pic.twitter.com/NGPpnZbpa1