మిషన్​ ఆన్​ నేచురల్​ ఫార్మింగ్​

దేశవ్యాప్తంగా కోటి మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేసేలా ప్రోత్సహించేందుకు రూ.2481 కోట్లతో ప్రకృతి వ్యవసాయంపై జాతీయ మిషన్​కు కేంద్ర క్యాబినెట్​ ఆమోదం తెలిపింది. ఇది వ్యవసాయ, రైతు మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో అమలయ్యే కేంద్ర ప్రాయోజిత పథకం. 

మిషన్ ఉద్దేశం

భూసారాన్ని మెరుగుపరచడం, రసాయనాలు లేని ఆహారం అందిండచం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని పెంపొందించడం. 

ముఖ్యాంశాలు

వచ్చే రెండేండ్లలో దేశవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో 15 వేల క్లస్టర్లలో 75 లక్షల హెక్టార్లలో ఈ మిషన్​ కింద రైతులు ప్రకృతి వ్యవసాయం చేసేలా ప్రోత్సహిస్తారు.     హెక్టార్​కు ఏడాదికి రూ.15,000 చొప్పున మూడేండ్లపాటు ఆర్థిక సాయం అందిస్తారు.     బయో ఇన్​పుట్​ రీసోర్స్​ సెంటర్లు(బీర్​సీలు) ఏర్పాటు చేసి, రైతులకు ఉపయోగపడే జీవామృతం, బీజామృతం తదితర ఉత్పత్తులను అందుబాటులో ఉంచేందుకు 10 వేల బయో ఇన్​పుట్​ రీసోర్స్​ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. 

మోడల్​ డెమోనిస్టేషన్ ఫామ్స్​

ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి 2000 నమూనా సాగు భూములను కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ వర్సిటీలు, రైతుల పొలాల్లో ఏర్పాటు చేస్తారు. ఆసక్తి ఉన్న రైతులకు ప్రకృతి వ్యవసాయంలో అనుభవజ్ఞులైన రైతులు, శిక్షకుల ద్వారా అక్కడ శిక్షణ ఇస్తారు.