పంట పొలానికి మిషన్ భగీరథ నీళ్లు!

మిషన్ భగీరథ పైప్ లైన్  నుంచి వ్యవసాయ పొలానికి నీళ్లు పారిస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం కోతులగిద్ద గ్రామంలోని మంచినీటి ట్యాంక్  పక్కనే వ్యవసాయ భూమి ఉంది. అందులో వరి సాగు చేశారు. అయితే గ్రామానికి వచ్చే పైప్ లైన్లకు ఉద్దేశపూర్వకంగా పెద్ద ఎత్తున లీకేజీలు పెట్టి వ్యవసాయ పొలానికి నీటిని మళ్లిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం గత కొంతకాలంగా జరుగుతోందని, పంచాయతీ కార్యదర్శి, వాటర్ మన్ కు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. పైప్ లైన్  ద్వారా మిషన్  భగీరథ నీళ్లు మళ్లించడంతో, ఇండ్లకు నీటి సప్లై సరిగా జరగడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. -