మిషన్ భగీరథ ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్

హైదరాబాద్ : పంచాయతీరాజ్ గ్రామీణాభివృ ద్ది, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి సీతక్క ఆదేశాలతో ఎర్రమంజిల్ లోని మిషన్ భగీరథ హెడ్ ఆఫీస్ లో కాల్ సెంటర్ ప్రారంభించా రు. డిసెంబర్ 23 నుంచి మిషన్ భగీరథ టోల్ ఫ్రీ నంబర్ 18005994007 అందుబాటులోకి వచ్చింది. గ్రామీణప్రాంతాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరాలో వచ్చే ఇబ్బందులపై కంప్లైంట్ చేసే అవకాశం కల్పించారు. సూపరిండెంట్ ఇంజినీర్ధ్వర్యంలో ఐదుగురు సిబ్బందితో24 గంటలు పాటు కాల్ సెంటర్ లో పనిచేసే లా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

ALSO READ | సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ కు మరోసారి నోటీసులు

 పగలు వచ్చే కాల్స్ ను అటెండ్ చేసి సిబ్బంది. వివరాలు నమోదు చేసుకోనున్నారు. రాత్రి వచ్చే కాల్స్ రికార్డు అవుతాయని అధికారు లు తెలిపారు. ప్రతి రోజు వచ్చే ఫిర్యాదులను మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి సమీ క్షించనున్నారు. 24 గంటల్లో సమస్యకు పరి ష్కారం చూపేలా చర్యలు తీసుకుంటామని అధికారులు వివరించారు. టోల్ ఫ్రీ ద్వారా అందే ఫిర్యాదులను క్షేత్ర స్థాయికి చేరవేసి పరి ష్కారానికి అవసరమైన సలహాలు సూచనలు చేయడంతో పాటు పరిష్కారం కోసం అవసర మయ్యే ఏర్పాట్లు చేయనన్నారు మిషన్ భగీరథ హెడ్ ఆఫీస్ సిబ్బంది.