మిస్సింగ్ అయిన యువకుడు బావిలో శవమై..

కీసర, వెలుగు: అదృశ్యమైన యువకుడు అనుమానాస్పద స్థితిలో బావిలో శవమై కనిపించాడు. కీసర పోలీసులు తెలిపిన ప్రకారం..యాదాద్రి జిల్లా అనంతారం గ్రామానికి చెందిన మచ్చ సాయికుమార్(27) కీసరలోని జయభేరి మారుతి షో రూంలో మెకానిక్ పని చేస్తున్నాడు. రెండు రోజుల కిందట డ్యూటీకి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్లలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు కంప్లయింట్ చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

కుటుంబ సభ్యులు ఆచూకీ తెలుసుకునేందుకు వాకబు చేస్తుండగా.. బోగారం గ్రామ శివారులోని లిక్కర్ గోదాం పక్కన బావిలో సాయికుమార్ మృతదేహాన్ని స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీని కీసర ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.