సంగంబండ నుంచి నీటి విడుదలకు మంత్రి ఆదేశం

పాలమూరు, వెలుగు: సాగునీటి కోసం తిప్పలు పడుతున్న మక్తల్  రైతులకు సంగంబండ నుంచి నీటిని విడుదల చేయడంతో ఊరట లభించింది. రైతుల విజ్ఞప్తి మేరకు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, మహబూబ్ నగర్  ఎంపీ క్యాండిడేట్​ చల్లా వంశీచంద్ రెడ్డి హైదరాబాద్ లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డిని కలిసి నీటి విడుదలకు ఒప్పించారు. వెంటనే నీటిని విడుదల చేయాలని మంత్రి ఆదేశించారు.

సోమవారం  రాత్రి 0.2 టీఎంసీ నీళ్లు సంగంబండ రిజర్వాయర్  నుంచి మాగనూరు వాగులోకి విడుదల కానున్నాయి. మక్తల్, మాగనూరు మండలాల్లోని వేల ఎకరాల పంటలు ఎండిపోకుండా కాపాడిన చల్లా వంశీచంద్ రెడ్డికి సంగంబండ, నేరుడుగం, గుర్లపల్లి, మాగనూర్, ఓబులాపురం, వర్కూర్, వడ్వాట్, అమ్మపల్లి, పెగడబండ, అడవి సత్యారం, చిట్యాల, పంచదేవపాడు, పసుపుల, మందిపల్లి, గద్రందొడ్డి గ్రామాల రైతులు కృతజ్ఞతలు తెలిపారు.