పెన్షన్ డబ్బులతో రోడ్డు మరమ్మతులా?

  • నివేదిక ఇవ్వాలని పీఆర్ కమిషనర్​కు మంత్రి సీతక్క ఆదేశం

హైదరాబాద్, వెలుగు: 'ఆసరా పెన్షన్ డబ్బులతో రోడ్ల మరమ్మతులు' అని ఓ పేపర్ లో వచ్చిన కథనంపై మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు. చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో  షాద్ నగర్~ చేవెళ్ల హైవేపై ఏర్పడిన గుంతలను పూడ్చేందుకు అదే గ్రామానికి చెందిన 200 మంది వృద్ధుల ఆసరా పెన్షన్ నుంచి రూ. 20 చొప్పున..మొత్తం రూ. 2 వేలు సమీకరించి పంచాయతీ సెక్రటరీ అశోక్ కు అందించారు. ఆ డబ్బుతో ఆయన రోడ్డు మరమ్మతులు చేపించినట్లు వార్త పబ్లిష్ అయింది.  దీనిపై కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ను పార్టీ నేతలు మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పంచాయతీ రాజ్ కమిషనర్ అనితా రాంచంద్రన్ ను మంత్రి సీతక్క ఆదేశించారు. దీంతో జిల్లా పంచాయతీ అధికారిని విచారణ జరపాలని కమిషనర్ స్పష్టం చేశారు.